మ‌రోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్‌

  • నిన్న 52వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోనూసూద్ కీల‌క నిర్ణ‌యం
  • వృద్ధాశ్ర‌మాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన న‌టుడు
  • 500 మంది వృద్ధుల‌కు ఇందులో ఆశ్ర‌యం క‌ల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డి
న‌టుడు సోనూసూద్ మ‌రోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నిన్న త‌న 52వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌రో గొప్ప కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. వృద్ధాశ్ర‌మాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 500 మంది వృద్ధుల‌కు ఇందులో ఆశ్ర‌యం క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు. ఎవ‌రూ లేని వృద్ధుల‌కు సుర‌క్షిత‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టించేందుకు ఈ ప్ర‌య‌త్న‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

ఇందులో వృద్ధుల‌కు ఆశ్ర‌యం ఇవ్వ‌డంతో పాటు వైద్య సంర‌క్ష‌ణ, పోష‌కాహారం కూడా అందించ‌నున్న‌ట్లు తెలిపారు. దీంతో ఈ రియ‌ల్ హీరోపై మ‌రోసారి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, సోనూసూద్ మ‌హమ్మారి క‌రోనా స‌మ‌యంలో దేశంలో  ఏ క‌ష్టం వ‌చ్చినా వెంట‌నే స్పందించి రియ‌ల్ హీరో అనిపించుకున్న విష‌యం తెలిసిందే. ఎంతోమందికి సాయం చేసి ఆదుకున్నారాయ‌న‌.    





More Telugu News