అమెరికాలో కూలిన యుద్ధ విమానం.. ఎఫ్ 35 జెట్ క్రాష్.. వీడియో ఇదిగో!

––
అమెరికాలోని కాలిఫోర్నియాలో యుద్ధ విమానం కూలిపోయింది. పైలట్ శిక్షణ తీసుకుంటుండగా దురదృష్టవశాత్తూ ఎఫ్ 35 యుద్ధ విమానం కూలిపోయిందని అమెరికా నేవీ ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం.. ఈ రోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కాలిఫోర్నియాలోని ఫ్రెన్సో సిటీకి 64 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని తెలిపింది. విమానం కూలడానికి ముందే పైలట్ బయటపడ్డాడని, పారాచూట్ సాయంతో నేలపై దిగాడని పేర్కొంది. ఈ ఘటనలో గాయాలపాలైన పైలట్ ను విమానంలో ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనాస్థలంలో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

F-35
F-35 crash
US Navy
California
Fresno
Fighter jet crash
Pilot ejection
Military accident
United States
War plane

More Telugu News