ఓటీటీలోకి కొత్త కంటెంట్

  • ఓటీటీలో ఈ వారం మూడు ప్రాజెక్టులు
  • ఆహాలో గురువారం నుంచి పాపా మూవీ, నెట్‌వర్క్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్
  • శుక్రవారం నుంచి జీ 5లో సట్టముం నీతియుం కోర్ట్ డ్రామా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్  
ఓటీటీ వేదికగా ఈ వారం ప్రేక్షకులకు వినోదం పంచేందుకు మరో మూడు ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి. ఈ రోజు రెండు విడుదల కాగా, ఇదివరకే తమిళంలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక సిరీస్ శుక్రవారం నుంచి తెలుగు ఆడియోతో అందుబాటులో ఉండనుంది.

అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన 'డాడా' తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో 'పాపా' పేరుతో జూన్ లో థియేటర్లలో విడుదలైంది. గణేశ్ కె. బాబు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ 'ఆహా'లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు ఇదే ఓటీటీలో 'నెట్ వర్క్' వెబ్ సిరీస్ నేటి నుంచే సందడి చేస్తోంది. శ్రీరామ్, ప్రియా వడ్లమాని తదితరులు ప్రధాన పాత్రల్లో సతీశ్ చంద్ర రూపొందించిన సిరీస్ ఇది.

శరవణన్, నమ్రతా ఎంవీ ప్రధాన పాత్రల్లో బాలాజీ సెల్వరాజ్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'సట్టముం నీతియుం'. ఈ కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ ఓటీటీ జీ5లో ఈ నెల 18న తమిళంలో విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో ఆగస్టు 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుందరమూర్తి అనే లాయర్ చుట్టూ తిరిగే కథ ఇది. ఏ కారణాల వల్ల ఆయన లా ప్రాక్టీసుకు దూరమయ్యాడు? న్యాయస్థానంలోకి మళ్లీ అడుగుపెట్టేందుకు ఆయన్ను కదిలించిన ఘటనేమిటి? వంటి ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కింది. 


More Telugu News