'నైసార్' ప్రయోగం విజయవంతం... శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

  • భారతీయ అంతరిక్ష పరిశోధన రంగంలో కీలక ఘట్టం
  • నాసా-ఇస్రో సంయుక్తంగా 'నైసార్' ఉపగ్రహ ప్రయోగం 
  • నైసార్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16
భారతీయ అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భాగస్వామ్యంతో ఇస్రో ఇవాళ 'నైసార్' అనే భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

"భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), నాసా కలిసి ప్రయోగించిన 'నైసార్' ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 వాహక నౌక  ద్వారా విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు నా అభినందనలు. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చేసిన ఈ ప్రయోగం విజయవంతం కావడం తెలుగువారిగా మనకు గర్వకారణం. అత్యంత శక్తివంతమైన ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఎంతో ఉపయుక్తమైనది. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ సాధిస్తున్న ప్రగతి మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక" అని చంద్రబాబు ఉద్ఘాటించారు. 


More Telugu News