భార్యను వదిలి ట్రాన్స్ జెండర్ తో సహజీవనం... ఆత్మహత్యాయత్నం చేసిన భార్య
- జగిత్యాలలో ఘటన
- భర్తకు ట్రాన్స్ జెండర్ తో పరిచయం
- ఒకే గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించిన అత్తమామలు
జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్‌కు చెందిన బింగి రాజశేఖర్, సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యల వివాహం 2014లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, రాజశేఖర్‌కు హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీనిపై తీవ్ర ఆవేదనకు గురైన భార్య లాస్య, రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, రాజశేఖర్ కనీసం ఆమెను చూసేందుకు కూడా రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
లాస్య కుటుంబసభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించగా... చివరికి, రాజశేఖర్ భీష్మనగర్‌లోని ఓ ఇంట్లో ట్రాన్స్‌జెండర్ దీపుతో కలిసి ఉంటున్నాడని తెలిసింది. లాస్య తల్లిదండ్రులు వారిద్దరినీ ఒక గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది.