హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం

  • పాయ‌ల్ తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ క‌న్నుమూత‌
  • ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన విష‌యం
  • ఇన్‌స్టాగ్రామ్ లో తాజాగా వెల్ల‌డించిన న‌టి
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట‌ తీవ్ర విషాదం నెల‌కొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) జులై 28న కన్నుమూసిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచిన‌ట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో తాజాగా వెల్ల‌డించారు. 

పాయ‌ల్ రాజ్‌పుత్ తన బాధను ఆమె సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేయ‌గా, ఇది అభిమానులను కలచివేసింది. "నాన్నా.. క్యాన్స‌ర్ నుంచి మీరు కోలుకునేందుకు నేను చేయ‌గ‌లిగిన‌దంతా చేశాను. కానీ విజ‌యం సాధించ‌లేక‌పోయా. క్ష‌మించండి" అని పాయ‌ల్ భావోద్వేగానికి లోన‌య్యారు. 


More Telugu News