'రాజాసాబ్‌' నుంచి సంజ‌య్ ద‌త్ లుక్ విడుద‌ల‌

  • ప్రభాస్‌, దర్శకుడు మారుతి కాంబోలో 'రాజాసాబ్‌'
  • హారర్ కామెడీ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో వ‌స్తున్న మూవీ
  • ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 5న విడుదల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన మేక‌ర్స్
  • కీలక పాత్రలో న‌టిస్తున్న సంజయ్ ద‌త్‌
  • ఈ రోజు సంజూ బాబా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రంలోని ఆయ‌న తాలూకు పోస్ట‌ర్ రిలీజ్‌
రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌, దర్శకుడు మారుతి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'రాజాసాబ్‌'. హారర్ కామెడీ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో వ‌స్తున్న ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే గ్లింప్స్ విడుద‌ల కాగా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 5న విడుదల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా,  ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్న‌ బాలీవుడ్ న‌టుడు సంజయ్‌ దత్‌ లుక్ ఒకటి తాజాగా విడుదల చేశారు.

ఈ రోజు ఆయ‌న‌ బర్త్‌ డే సందర్భంగా మేకర్స్‌ 'రాజాసాబ్‌' నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్ చేసేలా ఉంది. భారీగా పెరిగిన తలవెంట్రుకలు, గడ్డంతో సంజయ్ దత్ పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు తాజా స్టిల్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది.

కాగా, ఈ మూవీలో డార్లింగ్ స‌ర‌స‌న‌ మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. 




More Telugu News