జనాభా పెంచేందుకు చైనా కొత్త పథకం.. ఒక్కో బిడ్డకు యేటా రూ. 43వేలు
- కొన్నేళ్లుగా బాగా తగ్గిపోతున్న చైనా జనాభా
- జనాభాను పెంచడానికి డ్రాగన్ కంట్రీ కొత్త పథకానికి శ్రీకారం
- పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రుల ఖాతాలలోకి ఒక్కో బిడ్డకు యేటా రూ. 43వేలు
గతేడాది చైనాలో 90 లక్షల 54 వేల మంది జన్మించారు. ఈ సంఖ్య 2016లో జననాల్లో కేవలం సగం మాత్రమే. చైనా ప్రభుత్వం 30 ఏళ్ల పాటు ఒకరే సంతానం ఉండాలన్న విధానాన్ని అమలు చేసి 2016లో రద్దు చేసింది. చాలా మంది పెళ్లి చేసుకోవడం లేదని, పిల్లలను కనేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని, పెరుగుతున్న ఆర్థిక భారమే ఇందుకు కారణమని చైనా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొత్త పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉంది.