కన్వర్ యాత్రికులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. 18 మంది మృతి!
- ఝార్ఖండ్‌లోని దేవఘర్ జిల్లాలో ప్రమాదం
- గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు
- మృతుల సంఖ్యపై భిన్న వాదనలు
- తీవ్రంగా గాయపడిన మరో 20 మంది
ఝార్ఖండ్‌లోని దేవఘర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున దాదాపు 4:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వర్ యాత్రికులతో వెళ్తున్న బస్సు.. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది యాత్రికులు మరణించినట్టు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తెలిపారు. అయితే, పోలీసులు మాత్రం 9 మంది మరణించారని, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ విషాద ఘటన మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా ఫారెస్ట్ సమీపంలో జరిగింది.
ఈ ఘటనపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఎక్స్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నా లోక్‌సభ నియోజకవర్గం దేవఘర్‌లో కన్వర్ యాత్ర సందర్భంగా జరిగిన బస్సు-ట్రక్కు ప్రమాదంలో 18 మంది భక్తులు మరణించారు. బాబా బైద్యనాథ్ జీ వారి కుటుంబాలకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మృతుల సంఖ్యపై భిన్నమైన గణాంకాలు ఉన్నప్పటికీ, ఈ ప్రమాదం తీవ్ర విషాదకరమని స్పష్టమవుతోంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో మోహన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం తీవ్రంగా గాయపడిన వారిని దేవఘర్ సదర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.