హైదరాబాద్‌లో చిరుత సంచారం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

  • గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుత
  • రోడ్డు దాటుతున్న దృశ్యాలు కెమెరాలో నిక్షిప్తం
  • బోన్లకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న చిరుత
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుతపులి రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. తారామతి వెనుక భాగం నుంచి మూసీ నది వైపు చిరుత వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు గోల్కొండ పోలీసులకు సమాచారం అందించారు.

గత కొన్ని రోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం. గ్రేహౌండ్స్ ప్రాంతంలో అధికారులు నాలుగు బోన్లు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే, ఆ చిరుతపులి బోన్లకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. ప్రస్తుతం ఇబ్రహీంబాగ్ ప్రాంతంలో సంచరిస్తూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.


More Telugu News