Kanakadurga Temple: ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రి ఉత్సవాలు.. ఎప్పటి నుంచంటే?

Kanakadurga Temple Navaratri celebrations start date announced
--
బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) శీనానాయక్ వెల్లడించారు. ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 29న అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు.

ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని సెప్టెంబర్ 22న బాలా త్రిపుర సుందరిగా, 23న గాయత్రీ దేవి, 24 అన్నపూర్ణ దేవి సెప్టెంబర్ 25న కాత్యాయని దేవి, 26న మహాలక్ష్మి అలంకారం, 27న లలితా త్రిపుర సుందరి, 28న మహా చండీ దేవి, 29న సరస్వతి దేవి, 30న దుర్గాదేవిగా అలంకరిస్తారని స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కృష్ణా నదిలో హంసవాహక తెప్పోత్సవం నిర్వహిస్తామని ఈవో శీనానాయక్ వివరించారు.
Kanakadurga Temple
Devi Navaratri Utsavalu
Vijayawada
Indrakilaadri
Chandrababu
Durga Devi
Gayatri Devi
Saraswati
Krishna River

More Telugu News