Vizag CP: వైజాగ్ పోలీస్ స్టేషన్లలో కమిషనర్ తనిఖీ.. నిద్రపోతూ కనిపించిన సెంట్రీ

Vizag Commissioner of Police Inspection In PS



విశాఖపట్నంలోని వివిధ పోలీస్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును, అప్రమత్తతను గమనించేందుకు ఆదివారం అర్ధరాత్రి సడెన్ గా విజిట్ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా సీపీ శంఖబ్రత బాగ్చి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా.. స్టేషన్ కాపలా సిబ్బంది నిద్రపోతుండడం కనిపించింది. అప్రమత్తంగా ఉంటూ స్టేషన్ ను కాపాడాల్సిన సెంట్రీ డ్యూటీలో నిద్రపోతుండడంతో సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ద్వారకా పోలీస్ స్టేషన్ లో తలుపులు మూసి ఉండడంతో సీపీ ఆశ్చర్యపోయారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ స్టేషన్ తలుపులు మూసిన సిబ్బందిపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి మెమోలు జారీ చేయాలని సీపీ శంఖబ్రత బాగ్చి ఏసీపీలను ఆదేశించారు.
Vizag CP
Shankabrata Bagchi
Police Stations
Centry police
Visakhapatnam

More Telugu News