Nara Lokesh: రాష్ట్రాభివృద్ధిలో తెలుగువారంతా భాగస్వాములు కావాలి: మంత్రి లోకేశ్‌

Nara Lokesh calls for Telugu people to participate in AP development
  • సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న మంత్రి
  • తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో మంత్రి లోకేశ్ భేటీ
  • రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లోని తెలుగువారంతా స్వచ్ఛందంగా ముందుకు వ‌చ్చార‌ని వ్యాఖ్య  
సీఎం చంద్ర‌బాబు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌తో పాటు మంత్రుల బృందం కూడా అక్క‌డ ప‌ర్య‌టిస్తోంది. ఈ బృందంలో ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు. ఈ రోజు తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో లోకేశ్‌ సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... గత అయిదేళ్ల విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్చందంగా ముందుకు వచ్చార‌ని అన్నారు. అందుకే ఏ దేశం వెళ్లినా సీఎం చంద్ర‌బాబు, తాను తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నామని అన్నారు. 

సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును మనమంతా స్పూర్తిగా తీసుకోవాల‌ని, ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్రాభివృద్ధి లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రం ఊపిరి తీసుకుంటోందని తెలిపారు. ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్ లో పర్యటిస్తారు. ఆ పర్యటనలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొని విజయవంతం చేయాల‌ని అన్నారు. రాష్ట్రానికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని మంత్రి లోకేశ్ కోరారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లను అభినందించిన లోకేశ్‌ వారితో ఫొటోలు దిగారు.

Nara Lokesh
Andhra Pradesh
Singapore
Chandrababu Naidu
Telugu diaspora
Investments
AP development
PM Modi
Telugu community
Double Engine Sarkar

More Telugu News