షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు.. ఇదిగో వీడియో!

   
ఆటలాడితే, ఆరోగ్యంగా ఉంటామని అందరం అనుకుంటున్నాం. కానీ రెగ్యులర్‌గా షటిల్‌ ఆడుతున్న‌ 25 ఏళ్ల యువ‌కుడు మృత్యువు నుంచి తనను తాను కాపాడుకోలేకపోయాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ నాగోల్‌లో ఈ విషాద ఘ‌ట‌న జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో గుండ్ల‌ రాకేశ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడికి రోజూ షటిల్‌ ఆడే అలవాటు ఉంది. అలవాటు ప్రకారం, నాగోల్ స్టేడియంలో ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి షటిల్‌ ఆడుతుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఏం జరిగిందో తెలియక స‌హ‌చ‌రులు దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి లేపే ప్రయత్నం చేశారు. కానీ, క‌ళ్లు తెర‌వ‌క‌పోవ‌డంతో వెంటనే స‌మీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాకేశ్‌ను ప‌రిశీలించిన వైద్యులు అప్పటికే చ‌నిపోయిన‌ట్లు నిర్ధారించారు. మృతుడు రాకేశ్‌ది ఖ‌మ్మం జిల్లా తల్లాడ. చేతికి వచ్చిన కుమారుడు ఇలా మృతి చెందడంతో తల్లిదండ్రులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




More Telugu News