ఆమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్‌లు.. వీడియో వైర‌ల్‌!

  • ముంబైలోని ఆమిర్ బాంద్రా ఇంటికి పాతిక మంది ఐపీఎస్ అధికారులు
  • ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌.. నెట్టింట వైర‌ల్‌గా మారిన వీడియో
  • ఇంత‌మంది ఒకేసారి ఆమిర్ ఇంటిని సంద‌ర్శించ‌డం వెన‌క కార‌ణం ఏంట‌ని నెటిజ‌న్ల ఆరా
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎల్ అధికారులు రావ‌డం సినీ ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీని తాలూకు వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. వారు బ‌స్సు, వ్యాన్‌ల‌లో బాంద్రాలోని ఆమిర్ ఇంటికి వ‌చ్చారు. దీంతో ఇంత‌మంది ఒకేసారి ఆమిర్ ఇంటిని సంద‌ర్శించ‌డం వెన‌క కార‌ణం ఏంట‌ని నెటిజ‌న్లు ఆరా తీస్తున్నారు. 

ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త కోసం ఓ ఆంగ్ల మీడియా ఆమిర్ టీమ్‌ను సంప్ర‌దించింది. కానీ, వారికి కూడా ఈ విష‌యంలో క‌చ్చిత‌మైన స‌మాచారం అంద‌లేద‌ని తెలుస్తోంది. మేము కూడా ఇంకా ఆరా తీస్తున్నాం అని బ‌దులిచ్చారు. ఆమిర్‌ను క‌ల‌వ‌డం కోస‌మే వ‌చ్చారని మరికొన్ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. కాగా, ఆమిర్ త్వ‌ర‌లోనే ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజ‌రుకానున్న విష‌యం తెలిసిందే. ఈ అంత‌ర్జాతీయ వేదిక‌పై ఇటీవ‌ల ఆమిర్ న‌టించిన సితారే జమీన్ ప‌ర్ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.      


More Telugu News