హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి క్రిష్ వైదొల‌గ‌డానికి గ‌ల‌ కార‌ణం చెప్పిన జ్యోతికృష్ణ‌

  • ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు
  • ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మూవీ
  • సినిమాలోని కొన్ని సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌ల విష‌యంలో నెట్టింట‌ చ‌ర్చ 
  • తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ
  • మూవీలోని సీజీతో పాటు ద‌ర్శ‌కుడు క్రిష్ వైదొల‌గ‌డంపై వివ‌ర‌ణ‌
ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ మూవీ విడుద‌లైన త‌ర్వాత కొన్ని సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌ల విష‌యంలో సామాజిక మాధ్య‌మాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ దీని గురించి కొన్ని విష‌యాలు పంచుకున్నారు. అలాగే ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ ప్రాజెక్టు నుంచి వైదొల‌గ‌డానికి గ‌త కార‌ణాన్ని కూడా ఆయ‌న తెలియ‌జేశారు. అంతేగాక వీర‌మ‌ల్లును మొద‌ట కామెడీ సినిమాగా తీయాల‌నుకున్న‌ట్లు జ్యోతికృష్ణ చెప్పారు. 
 
జ్యోతికృష్ణ మాట్లాడుతూ... "నేను ఈ సినిమా ప్రారంభం నుంచి ఉన్నాను. కోహినూర్ ప్ర‌ధానాంశంగా సాగే ఈ క‌థ‌ను కామెడీ సినిమాగా రూపొందించాల‌ని భావించారు. మాయా బ‌జార్ స్టైల్‌లో తెర‌కెక్కించాల‌ని క్రిష్ అనుకున్నారు. అలాగే దీన్ని ప్రారంభించాం. మొద‌ట ఓ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను తీశాం. త‌ర్వాత క‌రోనా వచ్చింది. మ‌ళ్లీ మ‌రో యాక్ష‌న్ సీక్వెన్స్ తీశాక సెకండ్‌వేవ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల‌తో వ‌రుస విరామాలు వ‌చ్చాయి. 

క్రిష్ నా కోసం ఏడాది వేచి చూశారు. ఆయ‌న‌కు అంత‌కుముందే అంగీక‌రించిన ప్రాజెక్టులు ఉండ‌డంతో వైదొలిగారు. ఆ త‌ర్వాత క‌థ‌ను నేను రెండు పార్ట్‌లుగా తీస్తాన‌ని ప‌వ‌న్‌కు వివ‌రించా. బాగుంది.. నువ్వే ద‌ర్శ‌క‌త్వం వ‌హించు అని ప‌వ‌న్ అన్నారు. అక్క‌డి నుంచి నా జ‌ర్నీ ప్రారంభ‌మైంది. నేను మొద‌టి భాగం క‌థ‌లో మార్పులు చేశాను. 

క్రిష్ అనుకున్న కోహినూర్ క‌థ పార్ట్‌-2లో వ‌స్తుంది. కోహినూర్ కోసం అస‌లేం జ‌రిగింది అనేది చూపించ‌నున్నాం. ఇక‌, వీఎఫ్ఎక్స్ వియానికి వ‌స్తే.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కోసం 4399 సీజీ షాట్స్ వాడాం. వాటిలో 4, 5 షాట్స్ బాగా రాలేదు. వాటిని కూడా మార్చాం" అని చెప్పుకొచ్చారు. 




More Telugu News