కేటీఆర్ గురించి సీఎం రమేశ్ చెప్పింది నిజమే: బండి సంజయ్
- కేటీఆర్, సీఎం రమేశ్ మధ్య మాటల యుద్ధం
- తన వల్లే కేటీఆర్ సిరిసిల్లలో గెలిచాడన్న సీఎం రమేశ్
- సీఎం రమేశ్ తో కేటీఆర్ చర్చకు సిద్ధంగా ఉండాలన్న బండి సంజయ్
కేటీఆర్ వాడిన భాషను తీవ్రంగా తప్పుబట్టిన బండి సంజయ్, కేటీఆర్ భాషను మార్చుకోవాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ను "తండ్రి, కొడుకు, అల్లుడు" పార్టీగా అభివర్ణించిన బండి సంజయ్, బీఆర్‌ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, బీజేపీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కంచ గచ్చబౌలి భూములు, ఓ రోడ్ కాంట్రాక్టు విషయంలో కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేయగా... సీఎం రమేశ్ అంతకు రెట్టింపు స్థాయిలో స్పందించడం తెలిసిందే. ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే, కేటీఆర్ తన వద్దకు వచ్చి వాపోయాడని సీఎం రమేశ్ వెల్లడించారు. దాంతో తాను జోక్యం చేసుకుని కేటీఆర్ కు టికెట్ ఇప్పించానని సీఎం రమేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది నిజం కాదని కేటీఆర్ చెప్పగలరా? అని సవాల్ విసిరారు.