బీహార్‌లో వ్యక్తి హత్య కేసులో ట్విస్ట్.. కోడలిపై మామ సంచలన ఆరోపణలు!
- నిన్న తెల్లవారుజాము తన గదిలో విగతజీవిగా కనిపించిన సోను కుమార్
- మరో ఇద్దరితో కలిసి కోడలే హత్య చేసిందన్న సోను కుమార్ తండ్రి
- ట్యూటర్‌తో వివాహేతర సంబంధమే కారణమా?
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లగునియా రఘుకాంత్ గ్రామంలో 30 ఏళ్ల సోను కుమార్ తన ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. అతడి భార్య స్మితా ఝానే ఈ హత్య చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అనుమానంతో స్మితను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వైవాహిక జీవితంలో చిచ్చు
సోను తండ్రి టుంటున్ ఝా మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడి హత్యకు వారి వైవాహిక జీవితంలో నెలకొన్న సమస్యలే కారణమని ఆరోపించారు. సోను, స్మితలకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగిందని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. అయితే, వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని ఆయన పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సమస్యలు తీవ్రం కావడంతో స్థానిక పంచాయితీ పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారని, లిఖితపూర్వక ఒప్పందం కూడా జరిగిందని టుంటున్ ఝా వివరించారు.
ట్యూటర్‌తో సంబంధంపై సంచలన ఆరోపణలు
టుంటున్ ఝా చేసిన ఆరోపణలు కేసులో కీలక మలుపు తిప్పుతున్నాయి. అదే గ్రామానికి చెందిన హరిఓమ్ కుమార్ పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వారి ఇంటికి వచ్చేవాడని ఆయన తెలిపారు. ‘‘తన భార్య ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో ఉండగా చూసినట్టు నా కొడుకు చెప్పాడు’’ అని టుంటున్ ఝా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత కొంతకాలం ట్యూటర్ రావడం మానేసినట్టు తెలిసింది. అయితే, సోను అన్నయ్య పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ట్యూటర్ తిరిగి రావడంతో మళ్లీ ఆ దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అర్థరాత్రి ఏం జరిగింది?
సోను తండ్రి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి తన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడని, అప్పటికే తాను నిద్రపోయానని టుంటన్ చెప్పాడు. మరుసటి రోజు ఉదయం సోను తన గదిలో విగతజీవిగా పడి ఉన్నాడని, కోడలు స్మిత మాత్రం ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుని ఉందని చెప్పాడు. దగ్గరికి వెళ్లి చూడగా, సోను మెడపై గాయాలు స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు.
స్మిత మరో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సహాయంతో సోనును హత్య చేసి ఉంటుందని ఆయన ఆరోపించాడు. కుటుంబ సభ్యుల వాంగ్మూలం మేరకు, స్మితా ఝాను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.