సున్నా పరుగులకే రెండు వికెట్లు డౌన్... టీమిండియాను ఆదుకున్న గిల్, కేఎల్ రాహుల్

  • ఓల్డ్  ట్రాఫర్డ్ లో ఆసక్తికరంగా నాలుగో టెస్టు
  • నేడు నాలుగో రోజు ఆట
  • తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • ఇంగ్లండ్ కు 311 పరుగుల కీలక ఆధిక్యం
  • తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 358 పరుగులు
ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. ఇవాళ నాలుగో రోజు ఆటలో ఆతిథ్య ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌట్ కాగా... 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే అదిరిపోయే ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం సున్నా పరుగులకే 2 వికెట్లు పడ్డాయి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వరుస బంతుల్లో అవుటయ్యారు. క్రిస్ వోక్స్ విసిరిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వీరిద్దరూ అవుట్ కావడంతో భారత శిబిరం దిగ్భ్రాంతికి గురైంది. 

అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తో కలిసి కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత స్వీకరించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు అజేయంగా 94 పరుగులు జోడించారు. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 32 ఓవర్లలో 2 వికెట్లకు 94 పరుగులు కాగా... గిల్ 54, రాహుల్ 36 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 217 పరుగులు వెనుకబడి ఉంది. 


More Telugu News