CM Ramesh: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేస్తాయని కేటీఆర్ భయపడుతున్నారు: సీఎం రమేశ్

CM Ramesh Responds to KTR Allegations on Road Works
  • సీఎం రమేశ్ కు రేవంత్ రెడ్డి భారీ నామినేషన్ వర్క్ ఇచ్చారన్న కేటీఆర్!
  • రేవంత్ పై బురద చల్లడం కోసం తనపై ఆరోపణలు చేస్తున్నారన్న సీఎం రమేశ్
  • కేటీఆర్ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టీకరణ
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో రూ.1,660 కోట్ల రోడ్డు పనులు ఇచ్చారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడం తెలిసిందే. దీనిపై సీఎం రమేశ్ తీవ్రంగా స్పందించారు. 

తెలంగాణలో తనకు సీఎం రేవంత్ రెడ్డి భారీ నామినేషన్ వర్క్ ఇచ్చారంటూ కేటీఆర్ మాట్లాడుతున్న దాంట్లో నిజం లేదని సీఎం రమేశ్ స్పష్టం చేశారు. తనపై చేస్తున్న అసత్య ఆరోపణల పట్ల బహిరంగ చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిపై బురద చల్లడం కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేస్తాయన్న భయం కేటీఆర్ లో కనిపిస్తోందని అన్నారు. ఏపీలో జగన్ కు ఇంటి పోరు ఉన్నట్టే, కేటీఆర్ కు కూడా ఇంటి సమస్య ఉన్నట్టుందని సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. నాడు కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలో నా ఇంటికి వచ్చిన సంగతి... కేసులు ఎత్తివేస్తే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని చెప్పిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
CM Ramesh
KTR
Revanth Reddy
Telangana BJP
TDP alliance
BRS
Telangana elections
Future City
Telangana politics

More Telugu News