భద్రాచలం వద్ద 32 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
- ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
- నీటి మట్టం పెరగడంతో స్నాన ఘట్టాల వద్ద వరద నీటిలో మునిగిన మెట్లు
- వరద ప్రవాహంతో నీటిమట్టం ఇంకా పెరుగుతుందంటున్న అధికారులు
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం కొనసాగితే భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దుమ్ముగూడెం మండలం పరిధిలోని పర్ణశాల వద్ద నార చీరల ప్రదేశానికి వరద నీరు చేరడంతో పర్యాటకులను అనుమతించడం లేదు.
చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం పట్టణంలోకి స్లూయిజ్‌ల ద్వారా వరద నీరు ప్రవేశించకుండా నిరోధించడానికి అధికారులు మోటార్లను ఏర్పాటు చేశారు.