Chirag Paswan: నితీశ్ కుమార్‌పై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆగ్రహం

Chirag Paswan angry at Nitish Kumar
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్వపక్షం నుంచి నితీశ్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు
  • రాష్ట్రంలో దోపిడీలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆరోపణ
  • నేరాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం
  • ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు అసంతృప్తిగా ఉందని వ్యాఖ్య
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్‌కు మద్దతు తెలిపినందుకు చింతిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంత పార్టీ నుంచే నితీశ్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల బీహార్‌లో హోంగార్డు నియామక పరీక్ష రాసేందుకు వచ్చిన ఒక విద్యార్థిని స్పృహ తప్పి పడిపోగా, అంబులెన్స్‌లో ఆమెపై అత్యాచారం జరిగిన ఘటనపై చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ, నేరస్థుల ముందు బీహార్ యంత్రాంగం చేతులెత్తేసిందని, హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నేరాలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. నేరాల రేటును ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందని, బీహార్‌లో ప్రజలు సురక్షితంగా ఉండలేకపోతున్నారని అన్నారు. ప్రజలను రక్షించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు అసంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఇకనైనా మేల్కొని, నేరాలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వంలో చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్ పాశ్వాన్) మిత్రపక్షంగా ఉంది. అయితే, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందని చిరాగ్ పాశ్వాన్ ఇదివరకే సంకేతాలు ఇచ్చారు.
Chirag Paswan
Nitish Kumar
Bihar
Bihar Politics
Crime Rate Bihar
Lok Janshakti Party

More Telugu News