చాట్ జీపీటీపై ఆల్ట్ మన్ సంచలన వ్యాఖ్యలు
- యూజర్లు పంచుకునే సీక్రెట్లు దాచబోమని వెల్లడి
- అవసరమైతే బయటకు చెప్పేస్తుందన్న సీఈవో
- డిలీట్ చేసిన 30 రోజుల తర్వాత శాశ్వతంగా తొలగిస్తామని వివరణ
అవసరమైన సందర్భంలో బయటకు వెల్లడిస్తామని, ముఖ్యంగా న్యాయపరమైన అంశాలలో రహస్యాలను కాపడలేమని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులకు లోబడి యూజర్లకు సంబంధించిన డేటాలోని ఏ విషయాన్నైనా వెల్లడిస్తామని తేల్చిచెప్పారు. చాట్ జీపీటీలో డిలీట్ చేసిన సందేశాలు, చిత్రాలకు సంబంధించిన అంశంలో.. న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమైతే వాటిని భద్రపరుస్తామని, లేదంటే 30 రోజుల తర్వాత వాటిని శాశ్వతంగా తొలగిస్తామని ఆల్ట్ మన్ వివరించారు.