వారికి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.. కార్గిల్ అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు

  • కార్గిల్ యుద్దం జరిగి నేటికి సరిగ్గా 26 ఏళ్లు
  • కార్గిల్ అమరవీరులకు నివాళులర్పిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ట్వీట్
  • యుద్దంలో వారి త్యాగం, మన సాయుధ దళాల అచంచల సంకల్పానికి నిదర్శనమన్న రాజ్‌నాథ్
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని విడుదల చేశారు.

దేశాన్ని రక్షించడం కోసం అత్యంత కఠినమైన పరిస్థితుల్లో అసాధారణ ధైర్యసాహసాలు, ధృఢ సంకల్పంతో పోరాడి ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నానని ఆయన అన్నారు. కార్గిల్ యుద్ధంలో వారి త్యాగం, మన సాయుధ దళాల అచంచల సంకల్పానికి నిదర్శనమని కొనియాడారు. దేశం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 


More Telugu News