టిమ్ డేవిడ్ ఊచ‌కోత‌.. 37 బంతుల్లోనే శ‌త‌కం బాదిన ఆసీస్ ప్లేయ‌ర్‌

  • వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య మూడో టీ20 
  • ఆరు వికెట్ల తేడాతో విండిస్‌ను చిత్తు చేసిన‌ ఆసీస్
  • ఆసీస్ బ్యాట‌ర్‌ టిమ్ డేవిడ్ వీర‌విహారం
  • 16 బంతుల్లో అర్ధ శ‌త‌కం.. 37 బంతుల్లో శ‌త‌కం
  • అత‌ని తుపాన్ ఇన్నింగ్స్ లో 11 సిక్స‌ర్లు, 6 ఫోర్లు న‌మోదు
వెస్టిండీస్‌తో మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్ టిమ్ డేవిడ్ వీర‌విహారం చేశాడు. క‌రేబియ‌న్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. కేవ‌లం 37 బంతుల్లోనే శ‌త‌కం బాదాడు. అత‌ని తుపాన్ ఇన్నింగ్స్ లో 11 సిక్స‌ర్లు, 6 ఫోర్లు న‌మోదు కావ‌డం విశేషం. అలాగే డేవిడ్ కేవ‌లం 16 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఈ క్ర‌మంలో ఆసీస్ త‌ర‌ఫున ఫాస్టెస్ట్ సెంచ‌రీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేసిన ఆట‌గాడిగా రికార్డుకెక్కాడు. ఓవ‌రాల్‌గా టీ20ల్లో అత్యంత వేగ‌వంత‌మైన శ‌త‌కం ఈస్టోనియా ప్లేయ‌ర్ సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. అత‌డు కేవలం 27 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. 

ఇక‌, విండీస్‌తో ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో క‌రేబియ‌న్ జ‌ట్టును చిత్తు చేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 214 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, ఆ త‌ర్వాత ల‌క్ష్య‌ఛేద‌న‌కు దిగిన కంగారులు నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి, కేవ‌లం 16.1 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేశారు. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా 5 టీ20ల సిరీస్‌ను ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే 3-0తో కైవ‌సం చేసుకుంది. 


More Telugu News