హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ అరెస్టు

  • పుణేలో అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
  • హెచ్‌సీఏ అక్రమాల కేసులో ఏ2గా ఉన్న దేవరాజ్
  • దేవరాజ్‌తో ఆరుకు చేరిన అరెస్టైన వారి సంఖ్య
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాల కేసులో సంస్థ ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ అధికారులు అతడిని పుణేలో అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీఏ అక్రమాల కేసులో దేవరాజ్ ఏ2గా ఉన్నారు. తాజా అరెస్టుతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది.

హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. నకిలీ పత్రాలను సమర్పించి ఆయన అధ్యక్ష పదవిని పొందినట్లు ఆరోపణలు రావడంతో అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు పదిహేను రోజుల క్రితం వెల్లడించారు. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరొకరిని అరెస్టు చేశారు.


More Telugu News