24 గంటలు, 365 రోజులు భారత్ అప్రమత్తంగా ఉండాలి: సీడీఎస్ అనిల్ చౌహాన్

  • పాకిస్థాన్ ఎలాంటి దుస్సహాసానికి ఒడిగట్టినా మన దళాలు అప్రమత్తంగా ఉండాలన్న సీడీఎస్
  • ఆయుధాలు, ఇతర పరిజ్ఞానం గురించి మిలిటరీ అప్‌డేట్‌గా ఉండాలని సూచన
  • ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ సెమినార్‌లో మాట్లాడిన అనిల్ చౌహాన్
భారతదేశం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, పాకిస్థాన్ ఎటువంటి దుస్సాహసానికి ఒడిగట్టినా మన దళాలు 365 రోజులు, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ, సాంకేతికత అభివృద్ధి చెందిందని, సైన్యం కూడా ఎప్పటికప్పుడు వ్యూహాత్మకత, కార్యాచరణ, నైపుణ్యాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆయుధాలు, ఇతర పరిజ్ఞానం గురించి సైన్యం పూర్తిగా అప్‌డేట్ అయి ఉండాలని సూచించారు.

యుద్ధాల గతి మారిపోతోందని సీడీఎస్ వెల్లడించారు. భవిష్యత్తులో దళాల్లో ఇన్ఫో-టెక్‌తో పాటు స్కాలర్ వారియర్స్ కలగలిసి ఉంటారని అనిల్ చౌహాన్ అన్నారు. ఏం జరగబోతున్నా మనం ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు.


More Telugu News