మైన‌ర్‌పై అత్యాచారం.. ఆర్‌సీబీ పేస‌ర్ య‌శ్ ద‌యాళ్‌‌పై మ‌రో కేసు న‌మోదు

  • ఇటీవ‌లే యూపీ యువ‌తి ఫిర్యాదు మేర‌కు య‌శ్‌పై కేసు
  • తాజాగా రాజ‌స్థాన్‌కు చెందిన మ‌రో అమ్మాయి పోలీసుల‌కు ఫిర్యాదు
  • క్రికెట్ కెరీర్ చూపిస్తానంటూ త‌న‌పై రెండేళ్లుగా అత్యాచారం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌
  • క్రికెట‌ర్‌పై పోక్సో కేసు న‌మోదు చేసిన రాజస్థాన్ పోలీసులు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బౌలర్ యశ్‌ దయాళ్‌‌పై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువ‌తి ఫిర్యాదు నేప‌థ్యంలో ఇటీవ‌ల పోలీసులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, లైంగిక సంబంధం పెట్టుకున్నాడని యువ‌తి త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇదే కోవ‌లో తాజాగా రాజ‌స్థాన్‌కు చెందిన‌ మ‌రో అమ్మాయి అత‌నిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. క్రికెట్‌లో కెరీర్ చూపిస్తాన‌ని న‌మ్మించి రెండేళ్లుగా య‌శ్ త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు రాజ‌స్థాన్ పోలీసులు ఈ పేస‌ర్‌పై పోక్సో కేసు న‌మోదు చేశారు. 

జైపూర్‌లో ఐపీఎల్ మ్యాచ్ సంద‌ర్భంగా తొలిసారి తాను య‌శ్ ద‌యాళ్‌ను క‌లిసిన‌ట్లు త‌న ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. క్రికెట్ కెరీర్‌లో స‌ల‌హాలు ఇస్తానంటూ సీతాపూర‌లోని ఓ హోట‌ల్‌కు త‌న‌ను పిలిచి.. అక్క‌డ త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆరోపించింది. ఆ త‌ర్వాత నుంచి బ్లాక్‌మెయిల్ చేస్తూ రెండేళ్ల పాటు త‌న‌పై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని తెలిపింది. 

లైంగిక వేధింపులు మొద‌లైన‌ప్పుడు ఆ అమ్మాయి వయ‌సు 17 ఏళ్లు కావ‌డంతో పోక్సో చ‌ట్టం కింద య‌శ్ ద‌యాళ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే క్రికెట‌ర్‌కు క‌నీసం 10 ఏళ్లు లేక‌పోతే జీవిత ఖైదు ప‌డే అవ‌కాశం ఉంది. 


More Telugu News