చంటి పాపను వెంటబెట్టుకుని ప్రీమియర్ షోకు వెళ్లిన తల్లి.. వెనక్కి పంపిన పోలీసులు.. వీడియో ఇదిగో!

  • ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో హరిహర వీరమల్లు ప్రీమియర్ షో
  • పసిబిడ్డతో కలిసి వచ్చిన తల్లి.. తిప్పిపంపిన నిర్వాహకులు
  • పుష్ప –2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఇదే థియేటర్ లో తొక్కిసలాట
పవన్ కల్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు విడుదలకు ముందు ప్రీమియర్ షోలు వేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ లో నిన్న రాత్రి ప్రీమియర్ షో వేశారు. ఈ షో చూసేందుకు ఓ మహిళ తన చంటిబిడ్డతో కలిసి వచ్చింది. దీంతో థియేటర్ నిర్వాహకులు ఆమెను లోపలికి అనుమతించలేదు. బిడ్డతో పాటు ఆమెను వెనక్కి పంపించారు. గతంలో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఇదే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.

తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణం కోల్పోగా ఆమె కొడుకు కోమాలోకి వెళ్లాడు. సుదీర్ఘ చికిత్స తర్వాత ఇటీవలే ఆ బాలుడు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు ప్రీమియర్ షోకు పసిబిడ్డతో వచ్చిన తల్లిని పోలీసులు వెనక్కి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ మహిళపై తీవ్రంగా మండిపడుతున్నారు. చిన్న పిల్లను తీసుకుని బెనిఫిట్ షోకు రావడం ఏంటని విమర్శిస్తున్నారు.


More Telugu News