'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా గురించి హైప‌ర్ ఆది ఏమ‌న్నారంటే..!

  • ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'
  • నెట్టింట రివ్యూలు పెడుతున్న ప్రీమియ‌ర్, బెనిఫిట్ షోలు చూసిన వారు
  • ఇన్‌స్టా వేదిక‌గా మూవీపై త‌న అభిప్రాయాన్ని పంచుకున్న‌ హైప‌ర్ ఆది  
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' చిత్రం ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలు, బెనిఫిట్ షోస్ చూసిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా మూవీ గురించి త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ హైప‌ర్ ఆది కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. 

హైప‌ర్ ఆది మాట్లాడుతూ.. "ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' మూవీ ప్రీమియ‌ర్ షో చూశాను. సినిమా చాలా చాలా బాగుంది. ప‌వ‌న్ ఎంట్రీ సీన్ హైలైట్‌. మూవీలో ఇలాంటి ప‌వ‌న్ ఎలివేష‌న్ సీన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్‌, దానికి కీర‌వాణి ఇచ్చిన బీజీఎం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ప్ర‌తిఒక్క‌రూ ఫ్యామిలీతో క‌లిసి థియేట‌ర్ల‌కు వెళ్లి వీర‌మ‌ల్లు పోరాటాన్ని చూడండి. 

ఇక‌, ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న‌ప్పుడు నేను చాలాసార్లు సెట్‌కు వెళ్లి చూశాను. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అభిమానుల‌కు న‌చ్చే సినిమా చేయాల‌నే ఉద్దేశంతో ప్ర‌తి స‌న్నివేశంలో చాలా జాగ్ర‌త్త‌గా న‌టించారు. అది ఈ రోజు థియేట‌ర్‌లో స్క్రీన్‌పై క‌నిపిస్తోంది. ప్ర‌తి అభిమాని గ‌ర్వ‌ప‌డే సినిమా ఇది" అని చెప్పుకొచ్చారు.   


More Telugu News