ఎయిర్ పోర్టులో పెద్దిరెడ్డిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి!

  • ఎయిర్ పోర్టులో పెద్దిరెడ్డితో కొలికపూడి షేక్ హ్యాండ్!
  • చర్చనీయాంశంగా కొలికపూడి వ్యవహారం!
  • మరోసారి వివాదం అయ్యేనా?
ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైఖరి ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. కొన్ని వివాదాల్లో ఆయన పేరు వినిపించడంతో టీడీపీ అధిష్ఠానం ఇప్పటికే పలు హెచ్చరికలు చేసింది. తాజాగా, కొలికపూడి ఎయిర్ పోర్టులో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. ఆయన పెద్దిరెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది

దీనిపై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ నేతలతో మంచిగా ఉండడం అంటే పాముకు పాలు పోసినట్టేనని చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, కొలికపూడి తీరుపై అధిష్ఠానం స్పందించే అవకాశాలున్నాయి. 


More Telugu News