అనుమానంతో సహజీవన భాగ్వసామిని చంపి... ఆమె లిప్ స్టిక్ తో గోడపై రాశాడు!

  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • ఇద్దర బిడ్డల తల్లితో సహజీవనం చేస్తున్న డ్రైవర్
  • ఆమె మరొకరితో అఫైర్ లో ఉందని అనుమానం
  • ఆమెను, ఆమె కుమార్తెను గొంతు నులిమి చంపేసిన వైనం!
మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా గంజ్‌బసోడాలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. అనూజ్ విశ్వకర్మ అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న రామ్‌సఖి కుష్వాహా అనే మహిళను, ఆమె మూడేళ్ల కుమార్తె మాన్విని గొంతు నులిమి హత్య చేసినట్టు తెలుస్తోంది.

సోమవారం రాత్రి అద్దె ఇంట్లో ఈ ఘటన జరగ్గా, మంగళవారం ఉదయం ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, రామ్‌సఖి, మాన్వి మృతదేహాలు కనిపించాయి. రామ్‌సఖి పెద్ద కుమార్తె తను (7) తల్లి, చెల్లి మృతదేహాల వద్ద దీనంగా నిలుచుని ఉండడం చూపరులను కలచివేసింది.

మృతదేహాలు ఉన్న గదిలో గోడపై ఎరుపు లిప్‌స్టిక్‌తో "ఆమె మరొకరితో లేచిపోవాలని అనుకుంది" అని రాసి ఉండటం పోలీసులు గుర్తించారు. ఈ లిప్‌స్టిక్‌ రాత పోలీసులకు దర్యాప్తులో కీలక క్లూగా మారింది. 

డ్రైవర్‌గా పనిచేస్తున్న అనూజ్, గత రెండు నెలలుగా రామ్‌సఖి, ఆమె ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆమె భర్తగా నటిస్తూ ఆ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. రామ్‌సఖి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, ఆమె తన రెండవ భర్తతో గృహహింస కారణంగా విడిపోయింది.

అనూజ్ విశ్వకర్మ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.



More Telugu News