భారత్-పాక్ మ్యాచ్ రద్దు కావడంపై స్పందించిన మహ్మద్ సిరాజ్

  • ఏం చెప్పాలో తెలియడం లేదన్న మహ్మద్ సిరాజ్
  • తన దృష్టి సిరీస్ పైనే ఉందన్న సిరాజ్
  • తాను ఇప్పటికీ ఫిట్‌గానే ఉన్నానని వెల్లడి
భారత్ - పాక్ మ్యాచ్ రద్దుపై స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ స్పందించాడు. ఈ విషయంపై తాను ఎలా స్పందించాలో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించాడు. అసలు అక్కడ ఏం జరిగిందో తనకు అవగాహన లేదని, ఏమి మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని అన్నాడు. తన దృష్టి ప్రస్తుతం సిరీస్‌పైనే ఉందని స్పష్టం చేశాడు.

తాను సంపూర్ణ ఆరోగ్యంతో, ఫిట్‌గా ఉన్నానని సిరాజ్ వెల్లడించాడు. ఆధునిక క్రికెట్‌లో వర్క్ లోడ్ కూడా ఒక భాగమేనని అభిప్రాయపడ్డాడు. ఎన్ని ఓవర్లు వేస్తున్నామనే దానిపై డేటా అందుబాటులో ఉంటుందని, దాని గురించి తాను ఆందోళన చెందడం లేదని తెలిపాడు. అయితే, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, భారత విజయంలో తనవంతు పాత్ర పోషించడంపైనే దృష్టి సారించానని సిరాజ్ పేర్కొన్నాడు.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్థాన్‌తో మ్యాచ్ రద్దు చేయబడింది. భారత ఛాంపియన్స్ నిషేధం విధించడంతో నిర్వాహకులు భారత్ - పాక్ మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇరు జట్లకు చెరో పాయింట్లను కేటాయించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడకూడదని మాజీ ఆటగాళ్లు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


More Telugu News