తోడు లేనందుకు బాధగానే ఉంది.. అయితే స్వేచ్ఛగా జీవించడం బాగుంది: నిత్యామేనన్

  • జీవితంలో పెళ్లి ఓ భాగం మాత్రమే.. పెళ్లే జీవితం కాదన్న నటి
  • జీవితంలో కొన్ని అనుభవాలతో పాఠాలు నేర్చుకున్నా..
  • ఏం జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకు సాగాలంటూ వేదాంతం
జీవితంలో పెళ్లి ఓ ముఖ్యమైన భాగమే.. అయితే, పెళ్లి మాత్రమే జీవితం కాదని నటి నిత్యామేనన్ చెప్పారు. తన తాజా చిత్రం ‘సార్ మేడమ్’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లిపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. చాలా ఏళ్ల క్రితం ప్రేమ గురించి ఆలోచించా కానీ ఇప్పుడు అంత ఆసక్తిలేదని చెప్పుకొచ్చారు. 

చుట్టూ ఉన్న సమాజం, తల్లిదండ్రుల కారణంగా ఓ భాగస్వామి ఉండాల్సిందేనని అనిపించిందన్నారు. ఓ దశలో తగిన భాగస్వామి కోసం వెతికానని నిత్యామేనన్ చెప్పారు. అయితే, తనకు ఎదురైన కొన్ని అనుభవాలు జీవిత పాఠాలు నేర్పాయని అన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేరని, మనం వేరేరకంగా కూడా జీవితాన్ని ఆనందించవచ్చని తర్వాత అర్థం చేసుకున్నానని తెలిపారు.

పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని, పెళ్లి జరిగినా, జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఏం జరిగినా మన మంచికే అనుకొని ముందుకు సాగాలని నిత్యామేనన్ పేర్కొన్నారు.


More Telugu News