'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'ను చంద్ర‌బాబు చూస్తారా?.. ప‌వ‌న్ ఏమ‌న్నారంటే..!

     
అమ‌రావ‌తిలో జ‌రిగిన 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ప్ర‌మోష‌న్ల‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీ సినిమాను సీఎం చంద్ర‌బాబు చూస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ బ‌దులిచ్చారు. సీఎం రోజూ న‌న్ను చూస్తున్నారుగా. ఒక‌వేళ మూవీ చూసినా ఐదు నిమిషాలు చూస్తారేమో. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు చాలా బిజీగా ఉన్నారు. కూట‌మి ఎమ్మెల్యేలు కోరితే స్పెష‌ల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాం అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. 

కాగా, రేపు 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' విడుద‌ల కానుంది. దీంతో చిత్ర బృందం ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. సోమ‌వారం నాడు హైద‌రాబాద్‌లో ప‌వ‌న్ మీడియాతో ప్ర‌త్యేకంగా భేటీ కావ‌డంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ పాల్గొన్నారు. 



More Telugu News