నంద్యాల జిల్లాలో యువకుడిపై పెద్దపులి దాడి

  • నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఘ‌ట‌న‌
  • కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచు గూడెంకు చెందిన పులిచెర్ల అంకన్నపై పులి దాడి
  • నల్లమల అటవీ సమీపంలోని వరి పొలానికి వెళ్లిన యువ‌కుడిపై పంజా విసిరిన పులి
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో యువకుడిపై పెద్దపులి దాడి చేసింది. కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచు గూడెంకు చెందిన పులిచెర్ల అంకన్న నల్లమల అటవీ సమీపంలోని త‌న వరి పొలానికి వెళ్లాడు. అక్కడే పొదల్లో ఉన్న‌ పెద్దపులి... అతడిపై ఒక్కసారిగా దాడి చేసింది. 

వెంటనే అప్రమత్తమైన యువకుడు దాని నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అంకన్నను చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుడిపై పెద్దపులి దాడితో నల్లమల సమీపాన నివసిస్తున్న గిరిజనులు తీవ్ర‌ భయాందోళనకు గురవుతున్నారు. 


More Telugu News