ఆరోగ్యం బాగాలేదు భారత్ వెళతానంటే పాస్‌పోర్టు లాక్కున్నారు: గల్ఫ్ బాధితుడి సెల్ఫీ వీడియో

  • ఏడు నెలల క్రితం దుబాయ్ వెళ్లిన కరీంనగర్ జిల్లాలోని చిన్నముల్కనూర్ గ్రామవాసి
  • పని చేయలేని స్థితిలో ఉన్నానంటూ భార్యకు సెల్ఫీ వీడియో పంపిన బాలరాజు
  • తన భర్తను తీసుకు రావాలని ప్రభుత్వానికి  భార్య విజ్ఞప్తి
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణకు చెందిన ఒక కార్మికుడు, తనకు అనారోగ్యంగా ఉందని చెప్పినప్పటికీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని తన భార్యకు సెల్ఫీ వీడియో తీసి పంపించాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామానికి చెందిన బాలరాజు 7 నెలల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు.

ప్రస్తుతం తాను పని చేయలేని స్థితిలో ఉన్నానని సెల్ఫీ వీడియో తీసి భార్యకు పంపించాడు. అనారోగ్యంగా ఉన్నందున ఇంటికి వెళతానంటే యాజమాన్యం తన పాస్‌పోర్టు, ఇతర సామగ్రిని తీసుకొని ఇబ్బందులు పెడుతోందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో, తన భర్తను ఎలాగైనా తీసుకురావాలని భార్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.


More Telugu News