ఈరోజుకు వర్క్ ఫ్రమ్ హోమ్ పాటిస్తే మేలు: కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల సూచన
- ఈరోజు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం
- హెచ్చరించిన వాతావరణ కేంద్రం
- ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వర్క్ ఫ్రమ్ ఇస్తే మంచిదని సూచన
భాగ్యనగర ప్రజలకు, ముఖ్యంగా సంస్థలకు సైబరాబాద్ పోలీసులు ముఖ్య సూచన చేశారు. మంగళవారం నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు 'ఎక్స్' వేదికగా ఈ సూచన చేశారు. ఐటీ కంపెనీలు మంగళవారం వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని పాటిస్తే మంచిదని సూచించారు. కంపెనీలు సహకరించాలని కోరారు.