'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్‌లో అడుగుపెట్టిన‌ రాశి ఖన్నా.. మేక‌ర్స్ ఆస‌క్తిక‌ర పోస్టు

  • ప‌వ‌న్ క‌ల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో 'ఉస్తాద్ భగత్ సింగ్'
  • ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా శ్రీలీల‌.. కీల‌క పాత్ర‌లో రాశి ఖ‌న్నా
  • ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా మూవీ షూటింగ్‌
  • తాజా షూటింగ్ సెట్‌లో జాయిన్ అయిన రాశి ఖ‌న్నా
  • ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేక‌ర్స్ సోష‌ల్ మీడియా పోస్టు
హరీష్ శంకర్ దర్శకత్వంలో ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీలో ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా శ్రీలీల‌ న‌టిస్తున్నారు. అయితే, ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ లో తాజాగా రాశీ ఖ‌న్నా జాయిన్ అయిన‌ట్లు మేకర్స్ ధ్రువీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ సోష‌ల్ మీడియాలో ఆమె షూటింగ్‌లో జాయిన్ అయిన‌ట్లు ఒక పోస్టు పెట్టారు. ఇందులో ఆమె  'శ్లోక' అనే పాత్రలో న‌టిస్తున్నార‌ని, ఆమెకు స్వాగతం అంటూ పోస్టు పెట్టారు. 

కథాంశానికి కొత్తదనాన్ని తెచ్చే బలమైన, కీలకమైన పాత్రగా మేక‌ర్స్ పేర్కొన్నారు. ఈ మూవీలో రాశి ఖన్నా శ్లోక అనే పాత్రలో ఫోటోగ్రఫీ జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని స‌మాచారం. హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం అంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో ప్రతిబన్, కెఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్ షా, అవినాశ్ (కేజీఎఫ్ ఫేమ్), గౌతమి, నాగ మహేశ్ న‌టిస్తున్నారు. 


More Telugu News