అక్క‌డ కూడా ఆడ‌మ‌ని భార‌త్ హామీ ఇవ్వాలి: డ‌బ్ల్యూసీఎల్ మ్యాచ్ రద్దుపై సల్మాన్ భ‌ట్

  • మొన్న‌ పాక్‌తో జరగాల్సిన డ‌బ్ల్యూసీఎల్ మ్యాచ్ నుంచి వైదొలిగిన భార‌త్‌
  • దాంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేసిన నిర్వాహ‌కులు
  • ఇలా మ్యాచ్ ర‌ద్దు కావ‌డంపై పాక్ మాజీ క్రికెట‌ర్‌ ఆగ్ర‌హం
  • ప్రపంచ కప్, ఒలింపిక్స్‌లో కూడా పాక్‌తో ఆడ‌మ‌ని హామీ ఇవ్వాల‌న్న భ‌ట్
మొన్న (ఆదివారం) పాకిస్థాన్‌తో జరగాల్సిన‌ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్‌) మ్యాచ్‌ను భారత జట్టు బాయ్ కాట్ చేయ‌డంతో ర‌ద్దు అయిన విష‌యం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య క్రీడా వ్యవహారాల భవిష్యత్తుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. 

ఈ క్ర‌మంలో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బ‌హిష్క‌రించ‌డాన్ని పాక్‌ మాజీ ఆట‌గాడు సల్మాన్ భ‌ట్ త‌ప్పుబ‌ట్టాడు. ఐసీసీ ఈవెంట్‌లో రెండు జట్లు తలపడనున్నప్పుడు కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తామని భార‌త్ హామీ ఇవ్వాల‌ని కోరాడు.

"ప్రపంచం మొత్తం వారి గురించి మాట్లాడుకుంటోంది. వారు క్రికెట్‌కు, అభిమానులకు ఏం సందేశం పంపారు? మీరు ఏమి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు? మీరు ఏమి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు ప్రపంచ కప్‌లో ఆడకండి... ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ మాకు వ్యతిరేకంగా ఆడకండి. ఈ విష‌య‌మై భార‌త్ ఒక వాగ్దానం చేయాలి. ఏ స్థాయిలో లేదా టోర్నమెంట్‌లో మాపై ఆడకండి. ఒలింపిక్స్‌లో కూడా.

ఈ మనస్తత్వం ఏమిటి? నాకైతే అర్థం కాలేదు. ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారో? ఆడకూడదని నిర్ణయించుకున్న ఆ 4-5 మంది. వారి కారణంగా ఆడాలనే మనస్తత్వం ఉన్న ఇతరులు కూడా ఒత్తిడికి గురయ్యారు" అని భ‌ట్‌ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ అన్నాడు.


More Telugu News