ల్యాంక్‌షైర్ కౌంటీతో ప‌దేళ్ల అనుబంధం.. భార‌త క్రికెట్‌ దిగ్గ‌జానికి అరుదైన గౌర‌వం!

  • భార‌త్, ఇంగ్లండ్ నాలుగో టెస్టు వేళ ఫ‌రూఖ్ ఇంజ‌నీర్‌కు అరుదైన గౌర‌వం
  • మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్ర‌ఫోర్డ్ మైదానంలో ఒక స్టాండ్‌కు ఫ‌రూక్ పేరు
  • ఈ మేర‌కు ల్యాంక్‌షైర్ కౌంటీ క్ల‌బ్ నిర్ణ‌యం
  • విండీస్‌ లెజెండ్ క్లైవ్ లాయిడ్ పేరును కూడా ఒక స్టాండ్‌కు పెడతామ‌ని వెల్ల‌డి
భార‌త్, ఇంగ్లండ్ నాలుగో టెస్టు వేళ భార‌త‌ దిగ్గ‌జం ఫ‌రూఖ్ ఇంజ‌నీర్‌కు అరుదైన గౌర‌వం ల‌భించనుంది. మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్ర‌ఫోర్డ్ మైదానంలో ఒక స్టాండ్‌కు ఫ‌రూక్ పేరు పెట్టాల‌ని ల్యాంక్‌షైర్ కౌంటీ క్ల‌బ్ నిర్ణ‌యించింది. త‌మ‌జ‌ట్టుకు ప‌దేళ్లు ఆడిన ఆయ‌న సేవ‌ల‌కు గుర్తుగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సోమవారం స‌ద‌రు క్ల‌బ్ తెలియ‌జేసింది. వెస్టిండీస్ లెజెండ్ క్లైవ్ లాయిడ్ పేరును కూడా ఒక స్టాండ్‌కు పెడతామ‌ని పేర్కొంది.

"ఫ‌రూఖ్, లాయిడ్ మా క్ల‌బ్ క్రికెట్ పురోగ‌తికి విశేషంగా కృషి చేశారు. అందుకే ఈ దిగ్గ‌జ ఆట‌గాళ్ల పేర్ల‌తో స్టాండ్స్ ఏర్పాటు చేయాల‌నుకున్నాం. ఈ ఇద్ద‌రూ ఈ గౌర‌వానికి అన్ని విధాలా అర్హులు" అని ల్యాంక్‌షైర్ క్ల‌బ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. లాయిడ్ ఏకంగా రెండు ద‌శాబ్దాలు ఈ క్ల‌బ్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడాడు. 

ల్యాంక్‌షైర్ కౌంటీ త‌ర‌ఫున‌ ఫ‌రూఖ్ 1968 నుంచి 1976 వ‌ర‌కూ175 మ్యాచులు ఆడాడు. మొత్తం 5,942 ప‌రుగులు చేశాడు. వికెట్ కీప‌ర్ అయిన‌ అత‌డు ల్యాంక్‌షైర్ త‌రఫున 429 క్యాచ్‌లు ప‌ట్ట‌డ‌మే కాకుండా 35 స్టంపింగ్స్ చేశాడు. అంతేగాక‌ ఆ జ‌ట్టు నాలుగు సార్లు జిల్లెట్ క‌ప్ విజేత‌గా నిల‌వ‌డంలో ఫ‌రూఖ్ కీల‌క పాత్ర పోషించాడు. 


More Telugu News