'హరి హర వీరమల్లు' టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి.. ధరలివే!

  • పెయిడ్ ప్రీమియర్‌తో పాటు టిక్కెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి
  • 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతి
  • టిక్కెట్ ధరలు రూ. 150 నుంచి రూ. 200 వరకు పెంచుకోవడానికి అనుమతి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చారిత్రాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ చిత్రం తెలంగాణలో ఒకరోజు ముందుగానే ప్రదర్శితం కానుంది. పెయిడ్ ప్రీమియర్‌తో పాటు టిక్కెట్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినందున, ఎల్లుండి రాత్రి ప్రీమియర్ షో ప్రదర్శిస్తారు.

ఈ నెల 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. టిక్కెట్ ధర రూ.600గా నిర్ణయించారు. జీఎస్టీ అదనంగా వసూలు చేయబడుతుంది.

ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. విడుదలైన రోజు నుండి జులై 27వ తేదీ వరకు రోజుకు ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

టిక్కెట్ ధరల విషయానికి వస్తే, మల్టీప్లెక్స్‌లలో రూ.200 (జీఎస్టీ అదనం), సింగిల్ స్క్రీన్స్ రూ.150 (జీఎస్టీ అదనం) వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు ఐదు షోలకు అనుమతి ఉంది. మల్టీప్లెక్స్‌లలో రూ. 150 (జీఎస్టీ అదనం), సింగిల్ స్క్రీన్‌లలో రూ. 106 (జీఎస్టీ అదనం) వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.


More Telugu News