సాయం చేసేందుకు సిద్ధం: బంగ్లాదేశ్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ
- ఢాకాలో కూలిన శిక్షణ యుద్ధ విమానం
- పాఠశాలపై పడి పైలట్, విద్యార్థులు సహా 19 మంది మృతి
- ఈ ప్రమాదం తనను కలిచివేసిందన్న మోదీ
విమాన ప్రమాద వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని, మృతుల్లో చాలామంది విద్యార్థులు ఉన్నారని తెలిసి బాధ కలిగిందని పేర్కొన్నారు. ఈ దుర్ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ యుద్ధ విమానం ఢాకా సమీపంలోని పాఠశాలపై కూలిపోయిన ఘటనలో పైలట్‌తో పాటు 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా గాయపడ్డారు.