అద్దె ఇంటికి రూ.23 లక్షల అడ్వాన్స్... ఎక్కడో కాదు బెంగళూరులో!
- బెంగళూరులో అద్దె ఇంటి కోసం ప్రయత్నించిన కెనడా డిజిటల్ క్రియేటర్
- 4 బెడ్రూం ఇంటికి నెలకు రూ.2,30,000 అద్దె
- 10 నెలల అడ్వాన్స్ అడిగిన ఫ్లాట్ ఓనర్
బెంగళూరులోని ఓ ఇంటి యజమాని 4 బెడ్రూం ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ ఫ్లాట్ కు రూ.23 లక్షల భారీ సెక్యూరిటీ డిపాజిట్‌ను డిమాండ్ చేయడంతో కెనడాకు చెందిన డిజిటల్ క్రియేటర్ కాలెబ్ ఫ్రైసెన్ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నగరంలో అద్దె సంస్కృతిపై తీవ్ర చర్చకు దారితీసింది.
బెన్నిగనహళ్లిలో 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి ఫర్నిచర్ తో కూడిన ఈ ఇంటికి నెలవారీ అద్దె రూ.2,30,000గా ఉంది. అయితే, ఈ సెక్యూరిటీ డిపాజిట్ 10 నెలల అద్దెకు సమానమని ఫ్రైసెన్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అద్దె నిబంధనలను పోల్చిస్తూ, న్యూయార్క్, టొరంటోలో ఒక నెల, శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు నెలలు, లండన్‌లో 5-6 వారాల డిపాజిట్ మాత్రమే సాధారణమని ఆయన అన్నారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది. కొందరు ఈ అధిక డిమాండ్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు బెంగళూరులోని ప్రీమియం ప్రాపర్టీలకు ఇటువంటి డిపాజిట్లు సాధారణమేని వాదించారు. నగరంలో అద్దెదారులకు అనుకూలమైన నిబంధనలు లేకపోవడం ఈ అధిక డిమాండ్లకు కారణమని కొందరు వినియోగదారులు అభిప్రాయపడ్డారు. సాధారణంగా 5-6 నెలల అద్దె డిపాజిట్‌ను యజమానులు డిమాండ్ చేస్తారని పలువురు పేర్కొన్నారు.
అద్దె యజమానుల అత్యాశను తప్పుబడుతూ, కొందరు ఎంత అద్దె అయినా చెల్లించడానికి సిద్ధపడుతుండడం వల్లే ఇలాంటి డిమాండ్లు కొనసాగుతున్నాయని కొందరు వ్యాఖ్యానించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, సినిమా టిక్కెట్‌ల మాదిరిగా గృహాల అద్దెలపై ధర నియంత్రణలను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఒక వినియోగదారు సూచించారు.
ఈ ఘటన బెంగళూరులో అద్దె మార్కెట్‌లో నిబంధనలు మరియు పారదర్శకత అవసరాన్ని హైలైట్ చేసింది. అద్దెదారులు, యజమానుల మధ్య సమతుల్య విధానం కోసం చర్చలు కొనసాగుతున్నాయి.