Perni Nani: అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పేర్ని నాని!

YSRCP leader Perni Nani missing police search underway
  • రప్పా రప్పా కాదు... రాత్రికి రాత్రి చేసేయాలన్న పేర్ని నాని
  • రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు
  • ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఈనెల 8న పామర్రులో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. రప్పా రప్పా అని చెప్పడం కాదు... రాత్రికి రాత్రి చేసేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. 

తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన విన్నపాన్ని తోసిపుచ్చిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి (జులై 22) వాయిదా వేసింది. ఈ క్రమంలో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పేర్ని నాని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రేపటి హైకోర్టు విచారణ అనంతరం ఆయన వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Perni Nani
Perni Nani arrest
YSRCP leader
Andhra Pradesh politics
Pamarru comments
High Court bail
Missing Perni Nani
AP police search

More Telugu News