బస్సులో తిరువణ్ణామలైకి బదులు 'అరుణాచలం' పేరు.. కండక్టర్ సస్పెన్షన్
- బస్సు ఎల్ఈడీ తెరపై అరుణాచలం అంటూ అంగ్ల అక్షరాల్లో ప్రదర్శన
- 'తిరవణ్ణామలై' పేరును తప్పనిసరిగా వాడాలని కండక్టర్లకు సూచన
- అరుణాచలం పేరు ఉంచిన కండక్టర్‌ను సస్పెండ్ చేసిన జనరల్ మేనేజర్
దీనిని గమనించిన కొందరు ప్రయాణికులు సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఒక సామాజిక కార్యకర్త ఈ విషయంపై ప్రభుత్వ రవాణా సంస్థను ప్రశ్నించారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించారు.
ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ఆ సామాజిక కార్యకర్తకు అధికారులు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ పంపించారు. అదే సమయంలో తిరువణ్ణామలై వెళ్లే బస్సులో తప్పనిసరిగా అదే పేరును ప్రదర్శించాలని కండక్టర్లకు సూచించారు. మరోవైపు, అరుణాచలం అనే పేరును ఉంచిన కళ్లకురిచ్చికి చెందిన కండక్టర్ విజయ రాఘవన్‌ను సస్పెండ్ చేస్తూ విల్లుపురం జోన్ జనరల్ మేనేజర్ జయశంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.