ఆ అమ్మాయిని మీరు కంగారుపెడుతున్నారు... ఆమె బాగానే మాట్లాడుతోంది... హోస్ట్ కు నారా లోకేశ్ భరోసా

  • గుంటూరులో మెగా సీఏ విద్యార్థుల సమావేశం
  • హాజరైన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 
  • లోకేశ్ పేరు పలకడంలో తడబడిన హోస్ట్
  • ఆమె నుంచి మైక్ తీసుకున్న మరో హోస్ట్
  • ఫర్వాలేదు, ఆమెకు మైక్ ఇవ్వండంటూ లోకేశ్ భరోసా
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గుంటూరులో మెగా సీఏ విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి నిషా భాగేచా అనే సీఏ విద్యార్థిని హోస్ట్ గా వ్యవహరించింది. అయితే, నారా లోకేశ్ ను వేదికపైకి పిలిచే క్రమంలో పేరును పలకడంలో ఆ అమ్మాయి తడబడింది. దాంతో మరో హోస్ట్ ఆమె నుంచి మైక్ అందుకుని నారా లోకేశ్ ను వేదికపైకి ఆహ్వానించాడు. 

దాంతో వేదికపైకి వెళ్లిన నారా లోకేశ్... ఆ అమ్మాయి సరిగానే మాట్లాడుతోంది... ఎందుకు ఆ అమ్మాయిని కంగారుపెడుతున్నారు... తనకు మైక్ ఇవ్వండి అంటూ ఆ విద్యార్థినికి మైక్ ఇప్పించారు. అనంతరం ఆ అమ్మాయి చక్కగా యాంకరింగ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ తన సోషల్ మీడియా  ఖాతాలో పంచుకుంది. 


More Telugu News