ఆ కంపెనీకి 8,500 ఎకరాల భూమిని ధారాదత్తం చేసే కుటిల ప్రయత్నాన్ని విరమించుకోవాలి: వడ్డే శోభనాద్రీశ్వరరావు

  • అభివృద్ధి పేరుతో పంట పొలాలను ధ్వంసం చేయొద్దన్న శోభనాద్రీశ్వరరావు
  • శ్రీసిటీలో 5,500 ఎకరాల్లో 300కు పైగా కంపెనీలు ఉన్నాయని వ్యాఖ్య
  • ఇండోసోల్ కంపెనీకి 8,500 ఎకరాలు ధారాదత్తం చేయాలనుకుంటున్నారని మండిపాటు
అభివృద్ధి పేరుతో వేలాది ఎకరాల పంట పొలాలను ధ్వంసం చేయాలనుకోవడం సరికాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. పొలాలను ధ్వంసం చేయడంపై పునఃపరిశీలన చేసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. 5,500 ఎకరాల విస్తీర్ణం ఉన్న శ్రీసిటీలో 300కు పైగా 30 దేశాల కంపెనీలు కొనసాగుతున్నాయని... మరోవైపు, 8,500 ఎకరాలను ఒక్క ఇండోసోల్ అనే కంపెనీకి ధారాదత్తం చేయాలనుకుంటున్నారని... ఇలాంటి కుటిల ప్రయత్నాన్ని విరమించుకోవాలని అన్నారు. 

ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ. 42 వేల కోట్లు కేటాయిస్తే... ఇండోసోల్ కంపెనీకి రూ. 46,429 కోట్ల ప్రజాధనాన్ని ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇవ్వాలనుకోవడం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్షణరావు మాట్లాడుతూ, రైతుల నుంచి పచ్చటి పొలాలను లాక్కుంటే... ఆహార భద్రతకు విఘాతం కలుగుతుందని చెప్పారు.


More Telugu News