Talasani Srinivas Yadav: సొంత పార్టీ నేత పేరు మరిచిపోయిన తలసాని.. వీడియో ఇదిగో!

Talasani Srinivas Yadav Forgets Party Leader Name in Viral Video
--
తలసాని తడబడ్డారు.. సొంత పార్టీ నేత పేరే మర్చిపోయారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును తప్పుగా పలికారు. మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే..
బోనాల పండుగ నేపథ్యంలో ఇటీవల మల్కాజిగిరి పరిధిలో చేపట్టిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గొడవ జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ కార్యకర్త మేకల రాము యాదవ్ గాయపడ్డారు. తాజాగా మేకల రాము యాదవ్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు పరామర్శించారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండించారు.

అనంతరం ‘మా పార్టీ పెద్దలు వేణుగోపాల చారి గారు మాట్లాడతారు’ అని తలసాని పేర్కొన్నారు. మాజీ స్పీకర్ మధుసూధనాచారిని వేణుగోపాల చారి అని సంబోధించారు. దీంతో పక్కనే ఉన్న నేతలు వెంటనే మాజీ స్పీకర్ పేరును తలసానికి గుర్తుచేశారు. ఆ తర్వాత సరిదిద్దుకున్న తలసాని.. శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూధనాచారి మాట్లాడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Talasani Srinivas Yadav
BRS
Madhusudhanachari
Telangana politics
Malkajgiri
Bonalu festival
Gangula Kamalakar
Jogu Ramanna
Padmarao Goud

More Telugu News