Manickam Tagore: జగన్ మద్యం మాఫియా రాష్ట్రంలో కోటి పేద కుటుంబాలను నాశనం చేసింది: మాణికం ఠాగూర్‌

Manickam Tagore Slams Jagan Over Liquor Mafia in Andhra Pradesh
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్‌పై ఎక్స్ వేదిక‌గా మాణికం ఠాగూర్ సుదీర్ఘ పోస్టు
  • నాసిర‌కం మ‌ద్యంతో రూ. 3,200 కోట్లు కొల్లగొట్టార‌ని మండిపాటు
  • మిథున్ రెడ్డి కేవలం బంటు అన్న మాణికం ఠాగూర్ 
  • నిజమైన సూత్రధారులు మిస్టర్ & మిసెస్ జగన్ అని వ్యాఖ్య
వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జగన్ మద్యం మాఫియా ఆంధ్రప్రదేశ్‌లో ఒక కోటి పేద కుటుంబాలను నాశనం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ ఆరోపించారు. ఏపీ లిక్క‌ర్ స్కామ్‌పై ఆయ‌న ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా సుదీర్ఘ పోస్టు పెట్టారు. విశ్వసనీయ మద్యం బ్రాండ్ల స్థానంలో తక్కువ గ్రేడ్, హానికరమైనవి వచ్చాయని, నాసిర‌కం మ‌ద్యంతో రూ. 3,200 కోట్లు కొల్లగొట్టార‌ని ఆయ‌న త‌న పోస్టులో పేర్కొన్నారు. 

"విశ్వసనీయ మద్యం బ్రాండ్ల స్థానంలో తక్కువ గ్రేడ్, హానికరమైనవి వచ్చాయి. నాసిర‌కం మ‌ద్యంతో రూ. 3,200 కోట్లు కొల్ల‌గొట్టారు. మిథున్ రెడ్డి కేవలం బంటు. నిజమైన సూత్రధారులు మిస్టర్ అండ్ మిసెస్ జగన్. ఇది యాదృచ్ఛికంగా జరిగిన స్కామ్ కాదు. ఇది జగన్ శాస్త్రీయ అవినీతి ద్వారా బాగా ప్రణాళిక చేయబడిన, టాప్-డౌన్ ఆపరేషన్. నకిలీ సంస్థలు సృష్టించబడ్డాయి. దోపిడీని చట్టబద్ధం చేయడానికి పాలసీ తిరిగి వ్రాయబడింది. 

2020–2024 మధ్య కనీసం రూ. 3,200 కోట్లు మళ్లించబడ్డాయని సిట్ నివేదిక‌లు చెబుతున్నాయి. ఇందులో ఒక భాగం 2024 ఎన్నికల ప్రచారంలోకి పంపిణీ అయింది. నగదు, మద్యం ఉచిత వస్తువులుగా నియోజకవర్గాలలో పంపిణీ చేయబడ్డాయి. ఓటు కొనుగోలు, బూత్ నిర్వహణ కోసం ఉపయోగించబడింది" అని మాణికం ఠాగూర్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.  
Manickam Tagore
Jagan Mohan Reddy
Andhra Pradesh
AP Liquor Scam
YSRCP
Congress Party
Liquor Mafia
Corruption
AP Politics
Mithun Reddy

More Telugu News